నిన్న రేషన్ కార్డు….నేడు ఫించన్ కార్డు

కొత్త పింఛన్లతో కాంగ్రెస్‌ ‘సంక్షేమ వ్యూహం’ రేషన్‌ కార్డుల తర్వాత పింఛన్లపై ఫోకస్‌ 2.25 లక్షల మందికి లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలకు రాజకీయంగానే సమాధానం ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాల అమలును విస్తరించడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా సామాజిక భద్రతా పింఛన్లపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షలకు పైగా సామాజిక భద్రతా పింఛన్లు...