NIGAMA MEDIA (P) LTD
19.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

20 న పాంచజన్య సంకల్ప సభ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి
టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ 

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

ఈ నెల 20వ తేదీన కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు సభకు తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు.

తెలంగాణ హక్కులు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కొమురయ్య యాదవ్‌ అన్నారు. సభకు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటాలని ఆయన కోరారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు కార్యకర్తలు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.