NIGAMA MEDIA (P) LTD
26 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, August 19, 2026

TGBKS బాయిబాటలో RG-1 ఏరియా, వర్క్‌షాప్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):

TGBKS బాయిబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య (TGBKS) వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య RG-1 ఏరియా, ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం TGBKS అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన గుర్తింపు సంఘం AITUC, ప్రాతినిధ్య సంఘం INTUCల కాలపరిమితి మరో నెల రోజుల్లో ముగియనున్నప్పటికీ, కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు.సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన సొంత ఇంటి పథకం, అలాగే పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ మాఫీ వంటి కీలక అంశాలపై కార్మికులు గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ నిరాశే మిగిలిందన్నారు.

ఏరియా వర్క్‌షాప్‌లో సమస్యలు పరిష్కరించాలి

ఏరియా వర్క్‌షాప్‌లో అనేక సమస్యలు నెలకొన్నాయని మల్లన్న తెలిపారు. ముఖ్యంగా క్యాంటీన్‌లో కార్మికులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని ఆరోపించారు. కార్మికుల కనీస అవసరాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

నాడు BIFR పరిస్థితికి చేరుకున్న సింగరేణి సంస్థను కార్మికులు ఐక్యంగా, కష్టపడి పనిచేసి నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కార్మికులకు అత్యవసరమైన PPE కిట్లు, పని ముట్లు, ఇతర భద్రతా సామగ్రి కొనుగోలుకు కూడా నిధులు లేవనే కారణంతో యాజమాన్యం కాలయాపన చేస్తోందని విమర్శించారు.కార్మికుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో యాజమాన్యం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని TGBKS డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో TGBKS నాయకులు ముదిగిరి మల్లేష్, నరసింహస్వామి, చిగురుపల్లి మహేష్, శ్యామ్ కోరుకొప్పుల, తాండ్ర సత్యనారాయణ, శ్రీను అల్లాడి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.