TGBKS బాయిబాటలో RG-1 ఏరియా, వర్క్‌షాప్
కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): TGBKS బాయిబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య (TGBKS) వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య RG-1 ఏరియా, ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం TGBKS అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన గుర్తింపు సంఘం AITUC, ప్రాతినిధ్య సంఘం INTUCల కాలపరిమితి మరో నెల రోజుల్లో ముగియనున్నప్పటికీ, కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు.సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన సొంత...