NIGAMA MEDIA (P) LTD
20.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, August 17, 2026

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మందమర్రి ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని రద్దు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కలిసి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరవధికంగా శాంతియుత పోరాటాలు చేపడతామని తెలిపారు.

ఈ ధర్నా కార్యక్రమంలో క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, డా. రాజారమేష్, మందమర్రి పట్టణ, మండల, క్యాతన్‌పల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టిబిజికెఎస్ యూనియన్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.