కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మందమర్రి ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని రద్దు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కలిసి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరవధికంగా శాంతియుత పోరాటాలు చేపడతామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్...