NIGAMA MEDIA (P) LTD
23.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, August 17, 2026

మందమర్రిలో నూతనంగా “కళ్యాణిఖని ప్రెస్ క్లబ్” ఏర్పాటు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా పార్వతి రాజేష్ కుమార్,
జనరల్ సెక్రటరీ గా రామ్ వేణు
గౌరవ సలహాదారుగా కనపర్తి రమేష్

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):

మందమర్రిలో నూతనంగా కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఐక్యత, వృత్తి పరమైన సహకారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా క్లబ్‌ను ఏర్పాటు చేసినట్లు నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

క్లబ్ ప్రెసిడెంట్‌గా పార్వతి రాజేష్, జనరల్ సెక్రటరీగా రామ్ వేణు, ట్రెజరర్‌గా తెల్ల విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొమ్ము రాజేష్, గౌరవ సలహాదారుగా కనపర్తి రమేష్ ఎన్నికయ్యారు.అలాగే వైస్ ప్రెసిడెంట్లుగా మదాసు కుమార్, గరిగే సుమన్, ఎగుడ రాయమల్లు, జాయింట్ సెక్రటరీలుగా మాసు రాకేశ్, కంది రాజేశం, కాగితపు శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్‌గా అడిచెర్ల నాగేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జీవన్ కుమార్, పి.ఆర్.ఓ./క్లబ్ ఇంచార్జిగా బీరం రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కళ్యాణిఖని ప్రెస్ క్లబ్‌ను జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తామని, వృత్తి విలువలను కాపాడుతూ క్లబ్‌ను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఏర్పాటు కావడంతో జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.