NIGAMA MEDIA (P) LTD
17.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 21, 2026

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన స్థానికులు
మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పిలుపు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని లయన్ డైరెక్టర్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పిలుపునిచ్చారు. గురువారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్–320జి ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆదేశాల మేరకు మందమర్రి పట్టణంలోని 16వ వార్డులో 100 మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుతో పాటు లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల గౌతమ్ చారి, సభ్యుడు పోలు శ్రీను పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని సూచించారు. ముఖ్యంగా ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు.

మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడటంతో పాటు మానవ ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ కార్యదర్శి జకీర్, ట్రెజరర్ బుర్ర ఆంజనేయులు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ తోటం శ్రీను, డైరెక్టర్ కొప్పుల మధు, సభ్యుడు తాటికొండ లూథర్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ గోపీకృష్ణ, మున్సిపల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.