మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని లయన్ డైరెక్టర్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పిలుపునిచ్చారు. గురువారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్–320జి ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆదేశాల మేరకు మందమర్రి పట్టణంలోని 16వ వార్డులో 100 మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుతో...