32.8 C
Munich
Wednesday, August 5, 2026

కేకే-5 గని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కార్మికుల విరాళం రూ.10 లక్షలు
యాజమాన్యం మ్యాచింగ్ గ్రాంట్ రూ.10 లక్షలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

గత సంవత్సరం కేకే-5 గనిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు రసపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. కేకే గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, గని మేనేజర్ శంభునాథ్ పాండే సంయుక్తంగా దివంగత శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు, ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదును అందించారు. ఇందులో కార్మికుల విరాళంగా రూ.10 లక్షలు, యాజమాన్యం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో మరో రూ.10 లక్షలు అందజేశారు. యూనియన్ ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడంలో కార్మికులతో పాటు సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ చీకటి రమేష్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఆకుల రవళి, ఫిట్ సెక్రటరీ గాండ్ల సంపత్, ఏఐటీయూసీ నాయకులు, గని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.