శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారం
ఆషాఢ మాస పూజల్లో భక్తిశ్రద్ధలతో మహిళల గోరింటాకు పూజలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ఆషాఢ మాసం సందర్భంగా బీబీపేటలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవి అలంకారంలో సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.

అనంతరం వాసవి మహిళలు భక్తిశ్రద్ధలతో గోరింటాకు పూజ నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అల్పాహారం స్వీకరించారు. అనంతరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా సభ్యుల కోసం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ వాసవి క్లబ్ వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.

