20.9 C
Munich
Sunday, July 26, 2026

బాహుబలి 3 ముహూర్తం ఖరారు …

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బాహుబలి 3పై అధికారిక సంకేతం..
నెట్‌ఫ్లిక్స్ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క ప్రకటన

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు లేకపోయినా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ చిత్రాల విజయంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ చిత్రాల తర్వాత తెలుగు సినిమాలు వరుసగా పాన్ ఇండియా స్థాయిలో విజయాలు నమోదు చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సిరీస్‌కు మూడో భాగం ఉంటుందనే ప్రచారం చాలా కాలంగా కొనసాగుతోంది. తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూరేలా మేకర్స్ కీలక సంకేతం ఇచ్చారు.

“బాహుబలి” ‘ది టార్చ్ బేరర్’ పేరుతో రూపొందిన ప్రత్యేక కార్యక్రమం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్న నేపథ్యంలో విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో బాహుబలి 3పై ఆసక్తికర ప్రకటన చేశారు. ఆ వీడియోలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి మాట్లాడుతూ, “ప్రపంచం మొత్తం ఊహించని విధంగా మీ అందరి కోసం బాహుబలి 3 రాబోతోంది” అని వెల్లడించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అదే వీడియోలో ప్రభాస్, అనుష్క గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు. షూటింగ్ సమయంలో అనుష్క ఒక్కసారి నవ్వడం ప్రారంభిస్తే దాదాపు 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉండేదని, బాహుబలి చిత్రీకరణ విరామ సమయంలో అలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయని ప్రభాస్ సరదాగా గుర్తుచేశారు. బాహుబలి 3పై ఈ తాజా ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అయితే సినిమా కథ, షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీ వంటి వివరాలపై అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.