బాహుబలి 3 ముహూర్తం ఖరారు …

బాహుబలి 3పై అధికారిక సంకేతం.. నెట్‌ఫ్లిక్స్ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క ప్రకటన కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు లేకపోయినా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ చిత్రాల విజయంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ చిత్రాల తర్వాత తెలుగు సినిమాలు వరుసగా పాన్ ఇండియా స్థాయిలో విజయాలు నమోదు చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన...