20.9 C
Munich
Sunday, July 26, 2026

Cricket : బుమ్రా …భళా …

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Cricket : ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ ప్రస్తుతం ఎవరని ఏ క్రికెట్ అభిమానిని అడిగినా నిర్మొహమాటగా ఏమాత్రం ఆలోచించకుండా చెప్పే సమాధానం… బుమ్రా అనేస్తారు. బుమ్రా ధాటిని తట్టుకోడానికి ప్రత్యర్థి బౌలర్ కూడా ముందుగానే సన్నద్ధమవుతాడు. అదే బుమ్రా ప్రతేక్యత అంటారు క్రికెట్ ఆటగాళ్లతో పాటు అభిమానులు. బుమ్రా బంతి పట్టాడంటేనే ఎలా బంతిని తప్పించుకోవాలనే ఆలోచనలో బ్యాటమెన్ పడిపోతారనే ప్రచారం కూడా క్రికెట్ అభిమానుల్లో ఉంది. బుమ్రా ముగిసిన టి -20 పోటీల్లో సగటున ఓవర్ కి కేవలం అరంటే, ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడం వివేషం. ఫైనల్ పోటీలో కూడా నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి తన బలమేమిటో చూపించాడు. ఈ కొలతనే బుమ్రా బౌలింగ్ నైపుణ్యంకు ఒక తార్కాణమంటారు క్రికెట్ నిపుణులు.

టి-20 పోటీలో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఓటమిపాలైనది. అయినప్పటికీ బుమ్రా బౌలింగ్ లో ప్రతిభ తగ్గలేదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. వెస్టన్డీస్, పాకిస్థాన్ పై ఇండియా జట్టు విజయంలో కూడా బుమ్రా కీలకపాత్ర పోషించారు. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుపై గెలవడానికి చేసిన బుమ్రా కృషి అమోఘమంటున్నారు అభిమానులు. లేనిచో ఇండియా ఫైనల్ కు వచ్చేది కాదంటున్నారు. బుమ్రా వంటి బౌలర్ ఇండియా జట్టుకు లభించడం క్రికెట్ అభిమానుల అదృష్టమంటున్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.