NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Mavoist : లొంగిపోయిన మావోయిస్టు బండి ప్రకాష్ ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

40 ఏళ్ళు అజ్ఞాతంలోనే
సికాస కు కరువైన నాయకత్వం
వీటి అబ్రహం హత్య కేసులో కీలక పాత్ర
ఆదిలాబాద్ జైలు నుంచి కీలక నేతలను తప్పించడంలో ప్రధాన పాత్ర

Mavoist : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. లొంగుబాట్లు, ఎదురుకాల్పులతో సతమతమవుతోంది. మల్లోజుల వేణుగోపాల్ రావ్ ఇప్పటికే లొంగిపోయాడు. తక్కళ్లపెల్లి వాసుదేవరావు కూడా లొంగిపోడానికి సిద్దమయ్యాడు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, పార్టీ అనుబంధ సంఘం సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ అలియాస్ అశోక్ హైదరాబాద్ పోలీస్ అధికారుల ముందు లొంగిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

బండి ప్రకాష్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా మందమర్రి నివాసి. ముగ్గురు అన్నదమ్ముల్లో ప్రకాష్ రెండో సంతానం. తండ్రి సింగరేణి గని కార్మికుడు. చదివింది ఏడో తరగతి. మందమర్రి పట్టణంలోని కటిక దుకాణాల వద్ద అప్పటి పీపుల్స్ వార్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసేది. వాళ్ళు పాటలు పడుతుండగా తబలా, కంజిర వాయించేది. బండి ప్రకాష్ వీటిని వాయించడంలో మంచి నేర్పరి. ఆ విధంగా తబలా వాయిస్తూ ఆకర్షితుడై అడవిబాట పట్టాడు.

మందమర్రి సీపీఐ నేత వీటి అబ్రహం హత్య కేసులో ప్రకాష్ కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం. ఆ కేసులో హైదరాబాద్ లో అరెస్ట్ అయిన తరువాత ఆయనను ఆదిలాబాద్ జైలు కు తరలించారు. 1988 లో ఆదిలాబాద్ జైలు లో ఉన్న నల్ల ఆదిరెడ్డి, ముంజం రత్నయ్య, హుస్సేన్ తో పాటు బండి ప్రకాష్ తప్పించుకున్నారు. నల్ల ఆదిరెడ్డి అప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఆయనను తప్పించడానికి ప్రకాష్ పకడ్బందీగా పథకం వేసినట్టు సమాచారం. ఆయన దయిర్యంతోనే మిగతా ముగ్గురు జైలు నుంచి పారిపోయినట్టుగా సమాచారం. ఆ తరువాత ప్రకాష్ ఎప్పుడు కూడా ఇంటిముఖం చూడలేదు. అరెస్ట్ కూడా కాలేదు.

ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలోని మొవాడ్ లో పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో పెట్టిన బహిరంగ సభ నిర్వహణలో కూడా ప్రకాష్ ప్రధాన పాత్ర పోషించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చర్చల సందర్బంగా బయటకు వచ్చాడు. చర్చలు విఫలం కావడంతో తిరిగి పార్టీలోకి వెళ్ళాడు. కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావ్ అలియాస్ జంపన్న కు ప్రకాష్ నమ్మిన బంటుగా పేరుంది. ఒకవేళ లొంగిపోతే అతనితోనే లొంగిపోతాడని ప్రచారం సాగింది. తనను లొంగిపోయినట్టు కాకుండా అరెస్ట్ చూపిస్తే బాగుంటుందని లొంగుబాటకు ముందు మధ్యవర్తితో వ్యవహారం నడిపినట్టుగా సమాచారం. బండి ప్రకాష్ రాష్ట్ర కమిటీ సభ్యుడి హోదాతో పాటు సికాస కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ప్రకాష్ లొంగిపోవడంతో సికాస భాద్యతలు చూసేవారు కూడా పార్టీకి ఈ సమయంలో కరువైనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.