NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Congress : సింగరేణిలో పార్టీ పదవులకు నోచుకోని INTUC నాయకులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సింగరేణి లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మాల సామజిక వర్గంకే
కనీసం పార్టీ పదవులకు నోచుకోని మాదిగ సామజిక వర్గం
కష్టపడుతున్న యూనియన్ నేతలకు కరువైన పదవులు
డీసీసీ పదవుల కోసం డిమాండ్ చేస్తున్న యూనియన్ నేతలు

Congress : తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం INTUC నాయకులకు ఎలాంటి పార్టీ పదవులు దక్కడం లేదనే అభిప్రాయాలను పలువురు యూనియన్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో ఇదే పరిస్థితి కనబడు తోంది. ప్రస్తుతం డీసీసీ పదవుల ఎంపిక ముందుకు రావడంతో సీనియర్ యూనియన్ నేతలు పార్టీ పదవులను ఆశిస్తున్నారు. అందులో మాదిగ సామాజిక వర్గం యూనియన్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాలో నాలుగు ఎస్సి నియోజకవర్గాలు చెన్నూర్, బెల్లంపల్లి, మధిర, సత్తుపల్లి. ఈ నాలుగు నియోజక వర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా మాల సామజిక వర్గం నుంచి వివేక్ వెంకట స్వామి, వినోద్, బట్టి విక్రమార్క, మట్ట రాఘమయి గెలుపొందారు. ఇద్దరు మంత్రులు గా భాద్యతలు చేపట్టారు. యూనియన్ నుంచి కార్పొరేషన్ పదవి జనక్ ప్రసాద్ కు దక్కింది.

సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లోని అధికారులు, కార్మికుల ఓట్లు సుమారు 40 వేల కుటుంబాలవి ప్రభావం చూపుతాయి. ఈ ఓట్లపై అంతో, ఇంతో INTUC యూనియన్ నాయకుల ప్రభావం కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యూనియన్ నేతలు కష్టపడతారు. అయినా వారికి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కానీ దక్కదు. కనీసం పార్టీలో గుర్తింపు హోదా కలిగిన పదవికి నోచుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే టికెట్ మాల సామాజిక వర్గంకు పార్టీ కేటాయించింది. నాలుగు నియోజకవర్గాలు ఉన్న జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులను యూనియన్ లోని మాదిగ సామజిక వర్గానికే కేటాయించాలని యూనియన్ నేతలు కోరుతున్నారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు ఖర్గే, మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి మొదటి యూనియన్ భాద్యతలు నిర్వహించారు. ఆ తరువాత వారికి పార్టీ భాద్యతలు అప్పగించారు. అదే పద్దతి సింగరేణి లో యూనియన్ భాద్యతలు నిర్వహిస్తున్న మాదిగ సామాజిక వర్గంకు జిల్లా అధ్యక్ష భాద్యతలు అప్పగించాలని పలువురు నేతలు రాష్ట్ర పెద్దలను కోరుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.