19.9 C
Munich
Sunday, July 26, 2026

Singareni : కార్మికులు ఇక్కడ …. సంబరాలు అక్కడ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కష్టం కార్మికులది…సోకు మరొకరిది.
ప్రభుత్వానికి సంఘాలే అవసరమా ?.
ప్రభుత్వ తీరుపై కార్మికుల్లో అసంతృప్తి.
కార్మిక గుర్తింపు సంఘం పై అసహనం.

Singareni : దేవాలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కూడా నిర్వహిస్తారు. అందుకు రథాన్ని భక్తితో ఏంతో సుందరంగా తయారుచేస్తారు. అందంగా తయారైన రథాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేస్తారు. కానీ ఎంతో కస్టపడి అందంగా తయారైన ఆ రథంలో దేవుడి ఉత్సవ విగ్రహలు లేకుండానే దేవుడు గుడిలోనే ఉండి ఆశీర్వాదం చేస్తే ఫలితం భక్తులకు అందుతుందా అంటే అందదు. విగ్రహాలు లేకుండానే రథోత్సవం ఎంత వైభవంగా జరిగినా ఆ ఉత్సవాలకు ఎలాంటి ఫలితం కూడా ఉండదు.

ఇప్పుడు సింగరేణి సంస్థ లాభాల వాటా ప్రకటన విషయంలో కూడా రథోత్సవమే గుర్తుకు వస్తోంది. సింగరేణి బొగ్గు గని కార్మికులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల వాటాను హైద్రాబాద్ లో సింగరేణి యాజమాన్యంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న ప్రకటించడానికి ఏర్పాట్లు చేసింది యాజమాన్యం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం, సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సింగరేణి ఉన్నతాధి కారులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం నాయకులు హాజరవుతున్నారు. వీరి సమక్షములో సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు లాభాల వాటాను ప్రకటించనున్నారు.

సింగరేణి అధికారుల నియమ నిబంధనల మేరకు బాధ్యతతో విధులు నిర్వహించి సంస్థను కాపాడు కుంటున్న కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్నారు కార్మికులు. కస్టపడి సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చిన కార్మికులు లేకుండా ప్రకటన ఎక్కడో దూరంగా ప్రకటన చేయడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి విస్తరించిన పరిధిలో ప్రకటన చేస్తే ఆనందించేవారమంటూన్నారు. ప్రజాప్రతి నిధులు, కార్మిక సంఘాలు, యాజమాన్యం కలిసే నిర్దారించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించారా ? అని కూడా కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది. కార్మికుల సమక్షములో లాభాల ప్రకటన ప్రకటించిన నేపథ్యంలో కార్మికులు ప్రభుత్వానికి తమ అపరిష్కృత సమస్యలు చెప్పుకోడానికి అవకాశం ఏర్పడేది.

జనం మధ్యలో సంచరిస్తున్న ముఖ్యమంత్రి సింగరేణి లాభాల ప్రకటనను తమ మధ్య ఎందుకు ప్రకటించడం లేదంటున్నారు. అధికారపార్టీకి కేవలం ఆ రెండు కార్మిక సంఘాలు ఉంటె సరిపోతుందా అనే ప్రశ్నలు సింగరేణిలో తలెత్తుతున్నాయి. కార్మిక గుర్తింపు సంఘం కూడా ప్రభుత్వ నిర్ణయానికి తలూపడం పై కూడా కార్మిక వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. గణేష్ నిమజ్జనంకు వెళ్లి ఏర్పాట్లు పరిశీలించడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది. కానీ, మేము సాధించిన లాభాల వాటాను మా సమక్షములో ప్రకటించడానికి సమయం దొరకక పోవడం శోచనీయమంటున్నారు కార్మిక వర్గం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.