NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

YS sharmila : ఫోన్ ట్యాపింగ్ నిజమే…. షర్మిల

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

YS sharmila : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఏపీ లో కూడా ట్యాపింగ్ అంటుకుంది. తాజాగా షర్మిల మాట్లాడుతూ తన ఫోన్ ట్యాప్ అయిన వాస్తవమేనంటూ ప్రకటించారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుగా గతంలోనే తెలిసింది. అయినా అప్పుడు తాను నమ్మలేదు.

స్వయంగా వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి చెప్పడంతోనే తెలిసిందన్నారు. తన అడియా క్లిప్ కూడా వినిపించడం జరిగిందన్నారు షర్మిల. ఒక్క నా ఫోన్ లేక్ పరిమితం కాకుండా, తన భర్త, కుటుంబంతో సన్నితి సంబంధాలు ఉన్నవారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. రాజకీయంగా తాను ఎదగడాన్ని తట్టుకోలేకనే ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆమె ఆరోపించారు.

రాజకీయంగా అండగా ఉంటున్నవారితో పాటు,ఆర్థికంగా ఆడుకుంటున్న వారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో రాజకీయంగా బలహీనం చేశారని, మద్దతుగా ఉన్నవారిని భయానికి గురిచేశారని ఆరోపించారు. ఈ విషయంలో తాను ఎక్కడికి వచ్చయినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కు, వైఎస్ జగన్ కు ఆరోగ్యకరమైన సంబంధం ఉంది. వారిద్దరి మధ్య కొనసాగిన బంధం చివరకు రక్త సంబంధాన్ని కూడా దెబ్బతీసిందన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.