19.9 C
Munich
Sunday, July 26, 2026

Kamal hasan : కమల్ హాసన్ నష్టాలకు కారకులు ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Kamal hasan : తెలుగు చిత్ర పరిశ్రమతో ఇతర భాషల్లో కూడా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు మంచి పేరు ఉంది. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా ఉంది. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ఆయన తన వైవాహిక జీవితంలోనే సక్సెస్ కాలేక పోయారు. మొదటి భార్య వాణి గణపతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

పదేళ్ల తరువాత వాణి గణపతి, కమల్ హాసన్ విడిపోయారు. ఆ తరువాత నటి సారిక ను వివాహం చేసుకున్నారు. వారికీ శ్రుతి హాసన్ , అక్షర హాసన్ అనే ఇద్దరు అమ్మాయిలు. సారిక తో కూడా కమల్ హాసన్ కు బంధం తెగిపోయింది. ఆ తరువాత నటి గౌతమి తో సహజీవనం సాగించాడనే ప్రచారం చిత్ర పరిశ్రమలో ఉంది. కొన్నేళ్ల తరువాత గౌతమితో కూడా కమల్ హాసన్ దూరమయ్యారు.

ముగ్గురితో వివాహ బంధం తెగిపోయింది. కానీ ఆర్థికంగా ఆమె వల్లనే నష్టపోయాను అంటూ కమల్ హాసన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె ఎవరో కాదు మొదటి భార్య వాణి గణపతి. విడిపోవడం వలన ఆమెకు భరణం ఇవ్వడంతోనే ఆర్థికంగా నష్టపోయానంటూ కమల్ హాసన్ వెల్లడించారు.

కానీ కొన్నేళ్ల పాటు మౌనంగా ఉన్న వాణి గణపతి మాత్రం కమల్ హాసన్ మాట్లాడిన మాటలు తప్పు అంటూ కందించింది. అతని ఆర్థిక నష్టాలకు తాను కారణం కాదని స్పష్టం చేశారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.