NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Job : కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఈ పొరపాట్లు అసలే చేయరాదు ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Job : ఉద్యోగం సాధించడం వరకు ఒక ప్రక్రియ. వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం పెద్ద భాద్యత. ఉద్యోగంలో చేరిన అనంతరం ఇలాంటి పొరపాట్లు చేస్తే అసలుకే మోసం వస్తుందని సీనియర్ ఉద్యోగులు ఈ విదంగా చెబుతున్నారు.

ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తికి రెండు లేదంటే ఒక సంవత్సరం శిక్షణ కాలం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సమయ పాలన పాటించాలి. అవసరమైతే పది నిముషాలు ముందే కార్యాలయంలో ఉండాలి.

తోటి ఉద్యోగులు సీనియర్లు కాబట్టి వారితో మర్యాదగా ఉండాలి. తెలియని విషయాల గురించి వారితో చర్చిండానికి వెనుకాడరాదు. తోటి ఉద్యోగులతో ఎంత అనుకూలంగా ఉంటె అంత పట్టు సాధిస్తారు.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో, మీ బాధ్యతల గురించి తెలుసుకోండి. సంబంధిత ఉన్నతాధికారితో ఎలాంటి సమస్య ఉన్నా చర్చించి తెలుసుకోవాలి. చేస్తున్న పని దేనికి సంభందించిందో తెలుసుకొంటె, భవిష్యత్తులో సమర్థవంతంగా చేయగలరు.

మీ పనిని ఆనందంగా చేయండి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీరు ఆ సవాళ్లను సులభంగా ఎదుర్కోగలరు. పనిలో ఒత్తిడి, సవాళ్లు సహజం. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి ప్రయత్నించండి.

ఉద్యోగ శిక్షణ కాలంలో గైర్హాజరు ఉండరాదు. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సకాలంలో నిద్ర, భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.