24.4 C
Munich
Sunday, July 26, 2026

TTD : టీటీడీ విదేశీ కరెన్సీ లో భారీగా అవకతవకలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ ఈఓ శ్యామల రావు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరకామణి లెక్కింపులో సీనియర్‌ అసిస్టెంట్‌గా కృష్ణకుమార్‌ విధులు నిర్వహిస్తున్నారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించినట్లు విచారణలో తేల్చారు. అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్దారించారు. ఈ మేరకు కృష్ణకుమార్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు సస్పెండ్‌ చేశారు.

గత ఏడాదిలో హుండీలో వచ్చిన విదేశీ కి సంబందించిన కరెన్సీ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు దర్యాప్తులో కరెన్సీ లెక్కింపుల్లో తేడాలు వచ్చినట్టుగా గుర్తించారు.

హుండీ లో భక్తుల నుంచి వచ్చిన సుమారు 6 లక్షల విదేశీ కరెన్సీ ని కృష్ణ కుమార్ దారి మళ్లించినట్టు తేలింది. దింతో విజిలెన్స్ అధికారులు కృష్ణ కుమార్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఆరోపణలు రుజువు కావడంతో కృష్ణకుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.