19.9 C
Munich
Sunday, July 26, 2026

CM : ఆమె సినిమా నటి… ఆ రాష్ట్రానికి 23 రోజుల ముఖ్యమంత్రిగా భాద్యతలు.. ఎవరామె ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CM : సినిమా రంగానికే పరిమితమై ఉన్న నటీ, నటులు ఉన్నారు. కొందరు మధ్యంతరంగా పరిశ్రమను వదిలిపెట్టి స్థిరపడినవారు సైతం ఉన్నారు. మరి కొందరు రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు. రాజకీయాల్లో కొందరైతే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించు కున్నవారు ఉన్నారు.

అందులో సినిమా రంగం నుంచి వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన హీరోయిన్ కావడం విశేషం. ఆమె తమిళనాడు రాష్ట్రానికి 23 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టడం విశేషం. ఆమె ఎవరంటే….. వి.ఎన్‌.జానకి (V.N.Janaki). పూర్తి పేరు వైకోం నారాయణి జానకి.

పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విఎన్ జానకి 1988 జనవరి 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జానకి కేవలం 23 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగారు. అతి తక్కువ కాలం భాద్యతలు నెరవేర్చినప్పటికీ జానకి పేరు మాత్రం భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

భారత రాజకీయాల్లో సీఎం అయిన తొలి సినీ నటిగా ఆమె రాజకీయ, సినిమా చరిత్రలో నిలిచిపోవడం విశేషం. 23 రోజుల అనంతరం తమిళ నాడు రాష్ట్రంలో జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జానకి తరువాత కూడా మరో సినీ నటి జయలలిత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.