17.5 C
Munich
Tuesday, July 28, 2026

IND x NZ : ఇండియా X న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర ఎంతో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

IND x NZ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పోరుకు రంగం సిద్దమైనది. ఆదివారం నిర్వహించే ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు కప్పు కోసం హోరాహోరీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఏర్పాట్లను పూర్తి చేశారు నిర్వాహకులు. ఫైనల్ పోటీ చూడటానికి రెండు దేశాల క్రికెట్ అభిమానులు దుబాయ్ చేరుకుంటున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా దుబాయ్ బాట పట్టారు. దుబాయ్ వెళ్లి రావడానికి ఖర్చులతో పాటు టికెట్ ధరను కూడా భరించడానికి సిద్దమై దుబాయ్ లో ఆట చూడటానికి అభిమానులు తరలివెళుతున్నారు.

ఫైనల్ మ్యాచ్ నిర్వాహకులు దుబాయ్ లో టికెట్ల అమ్మకాన్ని ఈ పాటికే ప్రారంభించారు. ప్రస్తుతం ముప్ఫయ్ వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయినట్టు సమాచారం. స్టేడియంలో కేటాయించిన స్థాయిని బట్టి టికెట్ ధరలు నిర్ణయించారు. రూ : 6,000 నుంచి ప్రారంభమై రూ 2,83,000 వరకు టికెట్ ధర నిర్ణయించారు. సాధారణ టికెట్ల ధర రూ : 6000 నుంచి రూ : 11828 గా నిర్ణయించారు.

ఇండియా జట్టు ఫైనల్ కు చేరుకోవడంతో తమ అభిమానుల ఆటను చూడటానికి క్రికెట్ అభిమానులు భారీగా తరలివెళుతున్నారు. అందులో ఆదివారం సెలవు రోజు కావడంతో ఆర్థిక స్తోమత ఉన్నవారు దుబాయ్ వెళుతున్నారు. ఏది ఏమైనప్పటికి టికెట్ ధర లెక్కచేయకుండా క్రికెట్ అభిమానులు దుబాయ్ వెళ్లడం విశేషం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.