24.4 C
Munich
Sunday, July 26, 2026

shivaratri : శివరాత్రి రోజు ఈ ఐదు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. అంతా శుభమే జరుగుతుంది.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

shivaratri : శివరాత్రి పండుగ ఎంతో పవిత్రమైనది. భక్తి శ్రద్దలతో పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. సమీప నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. శివనామస్మరణం చేస్తూ జాగరణ చేస్తారు. మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమణ చేస్తారు. ఇంటిలో శివ పూజ చేయడానికి పూజ సామాగ్రి కొనుగోలు చేస్తారు. కానీ ఈ ఐదింటిని శివరాత్రి రోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి పూజ చేసిన భక్తులకు అంతా శుభమే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఆ ఐదు వస్తువులు ఏమిటంటే…..

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వెండి లేదంటే పాదరసంతో చేసిన శివ లింగాన్ని కొనుగోలు చేసి ఇంటిలో పూజ చేసిన నేపథ్యంలో శివుడి ఆశీర్వాదం లభిస్తుంది. పితృ, కాల సర్ప దోషం ఎవరికయినా ఉంటె వాళ్లకు విముక్తి లభిస్తుంది.

మహా మృత్యుంజయ యంత్రాన్నీ ఇంటిలో పెట్టుకోవడం వలన శుభం జరుగుతుంది. మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని మహా మృత్యుంజయ యంత్రాన్ని ఇంటికి తీసుకురావడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.

బిల్వపత్రి శివుడికి చాలా ఇష్టమైనది. ఈ పత్రిని పండుగ రోజు ఇంటిలో శివుడి వద్ద పెట్టి శివనామ స్మరణం చేయాలి. బిల్వ పత్రి వలన ఇంటిలో అనుకూల వాతావరణం ఏర్పడి, కుటుంబ సభ్యులు అంతా కూడా ఆనందంగా ఉంటారు.

స్వచ్చమైన రుద్రాక్షను కొనుగోలు చేయండి. రుద్రాక్ష శివుడి కన్నీటి నుంచి పుట్టిందని వేదంలో చెప్పబడింది. మంత్రాన్ని జపించి రుద్రాక్షను ఇంటిలో దేవుడి వద్ద శివరాత్రి పండుగ ముగిసే వరకు ఉంచాలి. ఆ తరువాత డబ్బు దాచిపెట్టే స్థలంలో రుద్రాక్షను పెట్టితే ఇంటిలో డబ్బుకు కొదవ ఉండదు. అదేవిదంగా ప్రశాంతత ఉంటుంది.

మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని నంది విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం శుభప్రదం. ఆలా తీసుకురావడం వలన శివుడు ఆనంద పడుతాడని వేదంలో చెప్పబడింది. డబ్బు దాచే స్థలంలో నంది విగ్రహాన్నిపెట్టడం వలన చేస్తున్న పనుల్లో పురోగతి, లాభాలు రావడం, డబ్బు కొరత లేకుండా ఉంటుంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.