24.4 C
Munich
Sunday, July 26, 2026

Gabbilam : గబ్బిలం ఇంటిలోకి వస్తే ఏమవుతుంది ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Gabbilam : పక్షులు, జంతువులు ఇంటిలోకి వస్తుంటాయి. ఇంటిపైన వాలుతుంటాయి. కొన్నింటి వలన మంచి జరుగుతుంది. మరికొన్నింటి వలన అశుభం జరుగుతుందని వేదంలో ఉంది. కానీ గబ్బిలం ఇంటిలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది. మంచి జరుగుతుందా ? చేదు జరుగుతుందా ? ఒకవేళ చెడు జరిగితే ఏమి చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం……

గబ్బిలం ఇంటిలో ప్రవేశిస్తే అశుభమని వేద పండితులు చెబుతున్నారు. దాని వలన ఇంటిలో ప్రశాంతత కరువై పోతుంది. ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని వేద పండితులు చెబుతున్నారు. గబ్బిలం ఇంటిలో ప్రవేశిస్తే అందుకు తగిన విదంగా పూజ చేయాలని వేదంలో చెప్పబడింది.

గబ్బిలం ఇంటిలో ప్రవేశించిన మరుసటి రోజు కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో గో మూత్రం, తులసి ఆకులు కలుపుకొని స్నానం చేయాలి. ఇంటి లోపలి గదులతో పాటు ఇంటి చుట్టుపక్కల గో మూత్రం, పసుపు, కర్పూరం కలిపిన నీటిని
చల్లుకోవాలి.

అనంతరం ఇష్టమైన దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవాలి. దేవాలయంలోని తీర్థం తీసుకువచ్చి అందులో తులసి ఆకులు వేయాలి. తులసి ఆకుతో తీర్థాన్ని కుటుంబ సభ్యులందరిపై చల్లాలి. ఈ విధంగా చేయడం వలన గబ్బిలం వలన వచ్చే చెడు శక్తులు తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.