23.9 C
Munich
Monday, July 27, 2026

schemes : మహిళలకు సువర్ణావకాశం… ఉపాధినిచ్చే పథకాలు ఇవే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

schemes : స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునే మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధినిచ్చే పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకాలకు పలు బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేయనున్నాయి. పారిశ్రామికంగా ఎదగాలనుకునే మహిళలకు ఇది ఒక సువర్ణావకాశం.

కళ్యాణి పథకం …. భారత దేశంలోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభించిన పథకం. ఈ పథకాన్ని సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే ప్రారంభించిన వారితో పాటు, కొత్తగా ప్రారంభించాలనుకునే మహిళలకు ఈ పథకం చాలా ఉత్తమమైనది.

ఉద్యోగిని …. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దేశంలోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. వార్షికాదాయం రూ ; 40 వేలు ఉన్న మహిళలు బ్యాంకు లో ఒక లక్ష రూపాయలు ఋణం పొందే అవకాశం ఉంది. తక్కువ వడ్డీకే ఋణం లభిస్తుంది.

మహిళా శక్తి యోజన : ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా రెండు లేదా అంత కంటే ఎక్కువ లక్షల రూపాయల రుణాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఋణం పొందిన మహిళలకు రాయితీ కూడా ఉంది.

ముద్ర యోజన :ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ముద్ర పథకం ద్వారా మహిళలకు రూ : 10 లక్షల వరకు ఋణం పొందడానికి అవకాశం ఉంది. తక్కువ నిబంధనలతో ఋణం పొందవచ్చు. ఎలాంటి గ్యారంటీ అవసరం లేకుండానే ఋణం పొందడానికి అవకాశం ఉంది.

అన్నపూర్ణ పథకం …. ఈ పథకం ఫుడ్ మరియు క్యాటరింగ్ పథకాలను ప్రారంభించే వారికి అనుకూలం. బ్యాంకు లో రూ : 50 వేల వరకు ఋణం పొందవచ్చు. 36 వాయిదాల్లో ఋణం చెల్లించాలి. ఈ పథకం కింద ఋణం పొందే వారు బ్యాంకు లో గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.