17.5 C
Munich
Tuesday, July 28, 2026

Sri sylam : శ్రీశైలం ఆలయ చరిత్రకు దొరికిన కీలక ఆధారాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Sri sylam : శక్తి పీఠాలకు, జ్యోతిర్లింగాలకు భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిర్లింగం, శక్తి పీఠంలను దర్శించి తమ భక్తిని చాటుకున్న వారు ఎందరో ఉన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉండటంతో శ్రీశైలం దేవస్థానంను ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు.

తాము శ్రీ పర్వతం భక్తులమని, శ్రీశైల దాసులమని క్రీస్తు శకం 300 సంవత్సరాల క్రితమే ఇక్ష్వాకులు ప్రకటించుకున్నట్టుగా శాసనాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు శకం 300 ఏళ్ల క్రితమే శ్రీశైలం ఉన్నట్లు ఇక్ష్వాకుల ప్రకటన ద్వారా స్పష్టమయి పోయింది. ఇక్ష్వాకుల కాలం నాటి నుంచి శ్రీశైలం పుణ్య క్షేత్రం ఉన్నట్టు పురావస్తు శాఖ వద్ద ఆధారాలు ఉన్నాయి.

2022 లో ఈఓ గా రామారావు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే శ్రీశైలంలో ఉన్న పంచ మఠాల జీర్నోద్దారణ పనులు మొదలు పెట్టారు. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా ఈఓ గట్టి బందోబస్తు తో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. ఈ పనులు మొదలు పెట్టినప్పుడే వెండి, బంగారు నాణేలు, రాగి శాసనాలు కూడా లభించాయి. వీటన్నిటిని పురావస్తు శాఖ అధికారులకు దేవస్థానం కమిటీ, వేద పండితుల సమక్షములోనే అప్పగించారు. దింతో పురావస్తు శాఖ అధికారులు వాటిపై అధ్యయనం చేయడం ప్రారంభించారు.

అదే విదంగా ఆలయం పరిధిలో ఉన్న ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సమయంలోనే పురాతన రాగిరేకులు కూడా లభించాయి. వాటి పై కూడా దేవస్థానంకు సంబంధించిన పలు శాసనాలున్నట్లు పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. 3 ఏళ్ల కిందట పంచమటాల పునరుద్ధరణ పనులను అధికారులు చేపట్టారు. అప్పుడే 20 సెట్ల రాగి రేకులు, కొన్ని బంగారు నాణేలు లభించాయి. వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పురావస్తు అధికారులు పరిశోధన చేపట్టారు.

రాగి రేకులు 12-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్నారు పురావస్తు అధికారులు. వీటిపై ఒడియా ,తెలుగు, కన్నడ , సంస్కృతం,,భాషల్లో గజపతులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు, పలు శాసనాలు రాయించినట్టు పురావస్తు శాఖ అధికారులు ప్రకటించారు. శ్రీశైలం ఆలయ చరిత్రకు ఇవి కీలక ఆధారాలుగా చెబుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.