13.2 C
Munich
Tuesday, July 28, 2026

Pavan Kalyan : సినిమా షూటింగ్ లకు సిద్దమవుతున్న ఆ రాష్ట్ర మంత్రి…

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Pavan Kalyan : సుమారు ఆరునెలలపాటు ఎన్నికల హడావుడి. విస్తృత ప్రచారం. అభ్యర్థుల ఎంపిక. ప్రభుత్వం ఏర్పాటు. భాద్యతలు స్వీకరణ. ప్రజల విన్నపాలు వినడం. ప్రజల సమస్యల పరిస్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు. ఇలా నిరంతరం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు ఆ రాష్ట్ర మంత్రి. ఇప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి తో పాటు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా. కాస్త తీరిక దొరికింది. అందుకే గతంలో ఒప్పుకున్న సినిమాలు మధ్యంతరంగా నిలిచిపోయాయి. ఇప్పుడు అసంపూర్తిగా నిలిచిపోయిన సినిమాలను పూర్తి చేయడానికి ఆ రాష్ట్ర మంత్రి సిద్ధమవుతున్నారు. ఆ మంత్రి ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

ఆగిపోయిన ” ఓజీ ” సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ చేయాలని నిర్ణయించినట్టు చిత్ర బృందం సమాచారం. గతంలో ఒప్పుకున్న సినిమాలు ఉన్నవి. కానీ ముందుగా ” ఓజి ” సినిమానే పూర్తి చేయాలని, అందుకు సంబందించిన డేట్లు కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగిందని సమాచారం. ఇటీవలనే ఆ సినిమా నిర్మాత దానయ్య కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారని సమాచారం. దింతో “ఓజి” సినిమాను ముందుగా పూర్తి చేద్దామని పవన్ కళ్యాణ్ కూడా నిర్మాత దానయ్య కు హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఈ ఏడాది కూడా ” ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ ” సినిమాను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం. ముందుగా ” ఓజి ” సినిమాను పూర్తి చేసిన తరువాతనే ” ఉస్తాద్ ” ను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ” ఓజి ” ” ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ ” సినిమాలు పూర్తి చేసిన తరువాతనే ” హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ” సినిమా షూటింగ్ మొదలు పెడుతారని చిత్ర పరిశ్రమలో టాక్.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.