19.2 C
Munich
Tuesday, July 28, 2026

చిరంజీవి పుట్టినరోజుకు భారీ ఏర్పాట్లు …

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఎప్పుడనేది ఆయన అభిమానులందరికి తెలిసిందే. పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అభిమానులకు ఎదో ఒక రూపంలో చిరంజీవి కానుకలు ఇస్తారు. ఈ సంవత్సరం కూడా చిరంజీవి తన అభిమానులకు భారీ బహుమతి ఇవ్వబోతున్నారని సినీ పరిశ్రమ సమాచారం. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను 2025 లో సంక్రాతి పండుగ పురస్కరించుకొని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. సంక్రాతి కానుకగా అభిమానుల సమక్షములో విడుదల చేయబోతున్నారు. విశ్వంభరలో చిరంజీవి సరసన ప్రముఖ నటి త్రిష నటిస్తోంది. అదేవిదంగా విశ్వంభర సినిమాలో చిరంజీవికి చెల్లులుగా ముగ్గురు ప్రముఖ తెలుగు హీరోయిన్లు నటించడం ఈ సినిమాలో ప్రత్యేకత. సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలను అందిస్తున్నారు.

ఇంకో విషయం ఏమిటంటే చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా పాటలకు సంబంధించిన రిహాల్స్ కూడా పూర్తయిందని సమాచారం. చిరంజీవి కోసం ప్రత్యేకంగా విశ్వంభర సినిమాలో ఒక ఐటెం సాంగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాటలో నటించేందుకు ఒక ప్రముఖ తెలుగు సీనియర్ హీరోయిన్ ను చిత్ర బృందం ఎంపిక చేసింది. చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా డ్యాన్స్ రిహాల్స్ నడుస్తున్నాయి. ఈ ఐటెం సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్మిస్తున్నారు. పాట కోసం భారీ ఎత్తున సెట్టింగ్ వేశారు.

విశ్వంభర సినిమా ఇప్పటివరకు కొంత మేరకు షూటింగ్ పూర్తి చేసుకొంది. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న సినిమాలోని కొన్ని అంశాలను గ్లిమ్స్ రూపంలో అభిమానుల ముందు ప్రదర్శించడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ తేదీ అభిమానులందరికి తెలిసిందే. పుట్టినరోజు పురస్కరించుకొని చిత్ర బృందం భారీ ఏర్పాట్ల మధ్య విశ్వంభర సినిమాకు సంభందించిన గ్లిమ్స్ ను ప్రదర్శించబోతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.