17.5 C
Munich
Tuesday, July 28, 2026

Milk Love : పాలు పోసి ప్రేమలో దింపిన హీరో… భయంతో ఊరువదిలి వెళ్లిన కుటుంబం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Milk Love : ఆయన సినిమా రంగంలోనూ తిరుగులేని హీరో. అంతే కాదు రాజ‌కీయ రంగంలోనూ పొలిటికల్ హీరోనే. భార్య,పిల్లలతోనూ ఆయ‌న‌కు ఎలాంటి అసంతృప్తి అంటూ లేదు. ఆనందకరమైన జీవితాన్ని అనుభ‌వించారు. అంత సక్సెసఫుల్ జీవితాన్ని అనుభవించిన ఆయ‌న‌కూ ఓ ఫెయిల్యూర్ కథ ఉంది. నిజజీవితంలో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమలో విజయం సాధించలేక పోయాడు. ఆ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

ఆయన అప్పటి వరకు సినిమాల్లో అడుగుపెట్టలేదు. త‌న కష్టాన్ని నమ్ముకున్న రోజుల‌వి. సినిమాల్లోకి రాక ముందు పాల వ్యాపారం చేసేది. ఇంటింటికి తిరిగి పాలు పోసేది. ఉదయాన్నే 3 గంట‌ల‌కు లేచేది. పాలు పితికి, సైకిల్ మీదనే విజ‌య‌వాడ చేరుకునేది. ఇంటింటికీ తిరిగి పాలు పోసేది. అలా సంపాదించిన నాలుగు డబ్బులతో తల్లిదండ్రులకు అండగా నిలిచేది. విజ‌య‌వాడ‌లో పలు పేరుపొందిన హోటళ్లకు కూడా ఆయ‌నే పాలు పోసేది. పాలు పోస్తున్నదంటే ఆయన మీద చాలా నమ్మకం. హోటళ్లతోపాటు కొన్ని ఇళ్లల్లో కూడా ఆయ‌న పాలు పోసేవారు.

పాలు పోస్తున్న క్రమంలోనే ఓ ఇంట్లో అంద‌మైన ముద్దు గుమ్మ కంట ప‌డింది. ఇద్ద‌రి చూపులు క‌లిశాయి. పాలు పొసే అబ్బాయి వ‌స్తార‌ని తెలిసి, ఉద‌యాన్నే అందంగా తయారై కిటీకిలోంచి ఎదురు చూసేది. ఇద్దరి మధ్య ఇలానే మూగ ప్రేమ క‌థ న‌డిచింది. ఆ త‌ర‌వాత కొద్దీ,కొద్దీ గా మాట‌లు మొద‌లైనాయి. ఆ తరువాత ఆ ఇంటి అరుగుదాకా ఇద్దరి ప్రేమ వెళ్ళింది. ఉదయాన్నేఅందరూ టీ , కాఫీ తాగితే, ఆ ఇద్దరు ముచ్చటతో గడిపేవారు. అరుగుమీదే కాసేపు మాట్లాడుకునేవారు. తెల్లవారు ఝాము కాబ‌ట్టి, ఎవ‌రూ ఉండే వారు కాదు.

అలా దొరికిన సమయాన్ని ముచ్చట కోసం ఉప‌యోగించు కొనేవారు. కొన్నాళ్లు గడిచింది. ఒకరోజు ఉదయం వీరిద్దరూ అరుగుమీద మాట్లాడుకునే విషయాన్నీ ఆమె తల్లిదండ్రులు గమనించారు. అమ్మాయిని మందలించారు. పాలు అమ్మే వాడితో ముచ్చట ఏమిటంటూ కోపం చేశారు. ఇంట్లో పెద్ద గొడ‌వే జ‌రిగింది. అమ్మాయిని అదుపులో పెట్టుకోలేకపోయారు. చివరకు ఆ పాలు పొసే అబ్బాయిని నీవు పాలు పోయడానికి మా వీధిలోకి రావద్దు అంటూ బెదిరించారు.

ఎంతయినా మొండిఘటం. ఎందుకు భయపడుతాడు. భయపడలేదు. వీధికి వెళుతున్నాడు. పాలు పోస్తూనే ఉన్నాడు. చూపులు మాత్రం క‌లుస్తూనే ఉన్నాయి. ఈ ప్రేమ‌ క‌థ ఎంతదూరం వెళ్తుందో అనే భ‌యం పట్టుకుంది అమ్మాయి తల్లిదండ్రులకు. చేసేది ఏమిలేక ఆ అమ్మాయిని తీసుకొని కుటుంబం అంతా విజయవాడ వదిలి వేరే ఊరికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎక్కడ ఉందొ తెలియదు. ఇద్దరు కూడా కొన్ని నెలల పాటు కలుసుకోలేదు. ఆ తరువాత ” బసవతారకం ” తో ఆయన తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు.

బసవతారకంను పెళ్లి చేసుకున్న ఆ వరుడు ఎవరో ఈపాటికే అర్థం అయ్యింది అనుకుంటా.. ఆయన చలనచిత్రరంగంలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటుడు, హీరో నందమూరి తారక రామారావు. అంతే కాదు తెలుగుదేశం పార్టీ స్థాపించి మూడు నెలల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఒకవేళ పాలుపోయగా ప్రేమలో పడిన అమ్మాయితో వివాహం జరిగితే ఆమే ముఖ్యమంత్రి భార్య అయ్యేది కావచ్చు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.