23.9 C
Munich
Monday, July 27, 2026

Actor Ali : వైసీపీ కి గుడ్ బై చెప్పిన నటుడు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Actor Ali : తెలుగు సినీ పరిశ్రమ హాస్యపు నటుడు అలీ వైసీపీ పార్టీ కి గుడ్ బై చెప్పేశారు.పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామానికి సినీ పరిశ్రమతో పాటు, ఏపీ లోని రాజకీయ వర్గాల్లో సైతం పెద్ద చర్చ జరిగింది. వైసీపీ కండువా కప్పుకున్న అలీ 2019 ఎన్నికల్లో పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో అలీ కి ప్రభుత్వంలో ఏదయినా మంచి పదవి వస్తుందని సినీపరిశ్రమతో పాటు వైసీపీ పార్టీలో చర్చ కూడా జరిగింది. ఎమ్మెల్సీ పదవి అని కొందరు. కాదు రాజ్య సభ పదవి అని మరికొందరు. వక్స్ బోర్డ్ చైర్మన్ పదవి వస్తుందని ఇలా వివిధ రకరకాల ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చివరకు 2022 లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించి చేతులు దులుపుకొంది. ఆ పదవితోనే అలీ కూడా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా వస్తుందనే ఆశతో రెండేళ్ల పాటు అదే పదవితో అలీ కాలం గడిపారు.

తాజాగా ఏపీ లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గోరపరాజయాన్ని మూటగట్టుకొంది. అధికారం పోయింది. కూటమి అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో నటుడు అలీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.