24.4 C
Munich
Sunday, July 26, 2026

Pavan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ???

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Pavan Kalyan : ప్రముఖ తెలుగు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశం. 2014 లో పార్టీ ఏర్పాటు. 2019 లో ఏపీ అస్సెంబ్లీ కి పోటీ. అయినా పవన్ కళ్యాణ్ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. పొత్తు కోసం ఒకవైపు తెలుగు దేశం, మరోవైపు బీజేపీ తో మంతనాలు. ఎట్టకేలకు కూటమి గా మూడు పార్టీలు కలిసి ఏర్పడ్డాయి. ఓటింగ్ సరళిని బట్టి చుస్తే కూటమి అధికారం చేపట్టడం ఖాయమనిపిస్తోంది. సర్వే లు కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. జనసేన అధినేత కూడా పిఠాపురం నుంచి భారీ మెజార్టీ తో విజయం సాధించబోతున్నాడని కూడా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

కూటమి విజయం సాధించిన నేపథ్యంలో సీఎం పదవి చంద్రబాబుకే దక్కుతుంది. ఇక మిగిలింది డిప్యూటీ సీఎం. ఈ పదవి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. డిప్యూటీ సీఎం పదవిని చేపడుతాడా, లేదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు పార్టీ శ్రేణులతోపాటు, సినీ వర్గాల్లో సైతం వ్యక్తం కావడం విశేషం. పదవి చేపడితే మరో మూడు నెలల పాటు కెమెరా ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతలేదు. పదవి భాద్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర అభివృద్ధికి సంభందించిన సమీక్షలు, సమావేశాలు , కార్యక్రమాలు నిత్యం ఉంటాయి. అటువంటప్పుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి. కొన్ని అసంపూర్తి సినిమాలు సైతం ఉన్నాయి. వీటన్నిటికీ పవన్ అడ్వాన్స్ లు తీసుకొని ఉన్నారు.

ఒకవైపు ఒప్పందం చేసుకున్న సినిమాలు పూర్తి చేయాలి. వాటితోపాటు నియోజకవర్గం భాద్యతలు చూసుకోవాలి, మరోవైపు పార్టీ భాద్యతలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ని ఎదుర్కోవడం. వీటన్నిటిని జనసేన అధినేత, ప్రముఖ నటుడు, కాబోయే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కోబోతున్నారో వేచిచూడాల్సిందే …..

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.