22 C
Munich
Monday, July 27, 2026

సిగ్గుపడకుండా చెబుతున్నా…ముస్లింలు కండోమ్ వాడుతున్నారు.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

MIM OYC : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఆకాశాన్ని అంటింది. ఒకరి కంటే ఒకరు తామేమి తక్కువ కాదన్నట్టుగ ఆరోపణలు, విమర్శలు,హామీలు చేసుకుంటున్నారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఒవైసీ హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎంఐఎం పార్టీ పై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఒవైసి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తే ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ పిల్లలు ఉన్నవారితో పాటు , దేశంలో చొరబాటుదారులకు దేశ్ సంపదను పంచిపెడుతుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఎంఐఎం నేత ఒవైసి తీవ్రంగా ఖండించారు. ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

జనాభా నియంత్రణ ప్రతి ముస్లిం కుటుంబం పాటిస్తోందన్నారు.అంతే కాకుండా జనాభా నియంత్రణ కోసం కండోమ్ ఎక్కువగా వాడుతున్నారని బహిరంగంగానే ప్రకటించారు. తనకు ఈ విషయం చెప్పడానికి సిగ్గు కూడా అనిపించడంలేదన్నారు. కండోమ్ విష్యం చెప్పేటప్పుడు ఆయన కొంత మేరకు ఆగ్రహంతో కనిపించారు. తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో మాట్లాడుతూ ఈ విదంగా మాట్లాడారు.

లేని మాటలు సృష్టిస్తూ ముస్లిం కుటుంబాల్లో ఎందుకు భయాందోళనలు తీసుకువస్తున్నారంటూ ఒవైసి అసహనం వ్యక్తం చేసారు. అదేవిదంగా ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపణ చేయడం కూడా సరికాదన్నారు.జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం తగ్గిందనే విషయాన్నీ కూడా ఆరోపణలు చేస్తున్న పార్టీల నాయకులు గమనించాలన్నారు. అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. సంతానోత్పత్తి తగ్గించుకోడానికి ముస్లిం కుటుంబాల్లో చాల కుటుంబాలు కండోమ్ వాడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ఏ మాత్రం సిగ్గు అనిపించడం లేదన్నారు.

ముస్లిం కుటుంబాల్లో జనాభా పెరిగితే మెజారిటీ కమ్యూనిటీ అవుతారంటూ హిందూ కుటుంబాలను భయానికి గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.