NIGAMA MEDIA (P) LTD
20.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

మందమర్రిలో పాతోళ్లు చేతులు కలిపిండ్రు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

వంశీ గెలుపే లక్ష్యమంటున్న నాయకులు
చేరినవారితో చేతులు కలపని పాతతరం
కోల్ బెల్ట్ ప్రతినిధి:
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపే తమ లక్ష్యమని మందమర్రి మున్సిపాల్టీ పరిధిలోని కొందరు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసారు.డాక్టర్ వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం పనిచేసిన తామందరం,ఇప్పుడు వంశి గెలుపు కోసం కష్టపడుతామని అంటున్నారు.ఇందులో విచిత్రం ఏముంది అనుకుంటున్నారా.ఎవరైనా పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేయాల్సిందేగా అనుకోవచ్చు. కానీ ఇందులోనే తిరకాసు ఉంది. వంశీ ని ఎంపీ గ గెలిపించుకుంటామని మందమర్రిలో సమావేశమై ప్రకటించిన నాయకులు అందరు కూడా పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నవారు కావడం విశేషం.ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న నాయకులతో సమావేశమైన నాయకులు చేతులు కలపకుండా,ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయడం మందమర్రిలో చర్చనీయాంశం అయ్యింది.
జెండా మోస్తున్నవారికే పదవులు ఇవ్వాలి …..
మేమంతా పార్టీని నమ్ముకొని ఉంటున్నాము.మేము పార్టీలు మారకుండా మూడు రంగుల జెండానే మోస్తున్నాము.మొదటినుంచి జెండా మోస్తున్నవారిని గుర్తించకుండా,జెండాలు మారుస్తున్నవారిని గుర్తించి గుర్తుపెట్టుకోవడం సరికాదని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పార్టీ మారిన ఒక నాయకుడికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై కూడా నాయకులు తీవ్రఅసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిదంగా ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూనియన్ తోపాటు,పార్టీకి సంబంధం లేని పలువురికి భాద్యతలు అప్పగించడంతోనే మందమర్రి ఏరియాలో యూనియన్ ఓటమి పాలైనదని ఆరోపించారు. ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా జరుగకపోవడంతోనే యూనియన్ ఓడిపోవడం జరిగిందన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్తగా చేరిన నాయకుల తోపాటు,వారి కుటుంబ సభ్యులకు భాద్యతలు అప్పగించారని ఆరోపించారు.పార్టీ నియమ,నిబంధనలు సీనియర్ నాయకులమైన మాకు తెలుసా,కొత్తగా కండువా కప్పుకున్న వారికి తెలుసా అని సమావేశమైన నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరైన గౌరవం, భాద్యతలు,ప్రచారం ఇవ్వకపోయినా తామంతా కూడా పార్టీ అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తరువాత పార్టీ పదవులతోపాటు, కార్పొరేషన్,నామినేటెడ్ పదవులను మొదటినుంచి పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్న వారికే ఇవ్వాలని,కొత్తగా చేరిన వారికి పదవులు కట్టబెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.