14.7 C
Munich
Tuesday, July 28, 2026

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల్లో మార్పులు,చేర్పులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మూడు స్థానాల్లో మూడో స్థానంకు పరిమితం
ప్రచారంలో వెనుకబాటుతనమే ప్రధాన కారణం
కోల్ బెల్ట్ ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై అనేక కళలు కన్నది.రెండంకెల పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటామని సభలు, సమావేశాల్లో ప్రకటించింది.అందుకు తగినట్టుగానే ముందస్తుగానే తెలంగాణాలో అభ్యర్థులను 17 స్థానాలకు ప్రకటించింది.బిఆర్ఎస్ కంటే ప్రచారంలో కొంత మేరకు ఫరవాలేదనిపించింది.కేంద్రంలో మూడోసారి అధికారం చేపడుతామనే గట్టి ధీమాలో ఢిల్లీ స్థాయి నాయకులు ఉన్నారు.400 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించాలని కాంగ్రెస్ కంటే దీటుగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.ప్రకటించిన నాయకులకు ప్రచారంలో అవలంబించాల్సిన పద్దతులను కూడా వివరించారు.ఈ నేపథ్యంలో 17స్థానాల్లో ముగ్గురు మాత్రం ఢిల్లీ నాయకుల గెలుపు సూత్రాలను పాటించడమేలేదని స్థానిక ఎన్నికల భాద్యులు ఢిల్లీకి నివేదికలు పంపినట్టు పార్టీ వర్గాల సమాచారం.
పెద్దపల్లి,ఖమ్మం,నల్గొండ పార్లమెంట్ స్థానాలకు ప్రకటించిన అభ్యర్థులు ఇంటి నుంచి బయటకు రావడం లేదనే విమర్శలు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి.ముగ్గురి ప్రచారం పై రాష్ట్ర నాయకత్వం కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.గ్రామ,పట్టణ,మండల,జిల్లా స్థాయి నాయకులను కలుపుకొని ప్రచారం చేపట్టకపోవడంతోనే మూడు స్థానాల్లో పార్టీ వెనుకబడిపోయిందని నివేదికలను పంపారు.బలమైన అభ్యర్థులని నమ్మి ఎంపిక చేస్తే బిఆర్ఎస్ కంటే కూడా ప్రచారంలో వెనుకబడిపోయారని స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
నల్గొండలో…..
బిఆర్ఎస్ లో ఉన్న సానంపూడి సైది రెడ్డి ని పార్టీలో చేర్చుకొని నల్గొండ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అభ్యర్థిగా ప్రకటించిన నాటినుంచే ఆయన నాయకులను,కార్యకర్తలను కలుపుకొని పోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.ఇటీవల పార్టీ మరోసారి సర్వే చేపట్టగా వెరీ పూర్ అంటూ తేలింది.బిఆర్ఎస్ కంటే కూడా వెనుకబడిపోయాడని సర్వే లో తేలింది. ఈ నేపథ్యంలో నల్గొండ స్థానాన్ని మార్చాలనే ఆలోచనలో బీజేపీ ఎన్నికల కమిటీ ఉన్నటు సమాచారం
ఖమ్మంలో…. .
ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావ్ ను బరిలో దింపింది.ఖమ్మంలో జలగం వెంకట్ రావ్ కె టికెట్ దాదాపుగా ఖరారు అయ్యిందనే ప్రచారం సాగింది.చివరి నిమిషంలో వినోదరావ్ పేరు తెరపైకి రావడంతో పార్టీ శ్రేణులు ఖంగుతిన్నారు.అయినా నాయకులు ఓర్చుకున్నారు.కానీ పార్టీ నియోజకవర్గం స్థాయి నాయకులు, కార్యకర్తలు ఆశించిన మేరకు ప్రచారం సాగడంలేదని ప్రచారం వచ్చింది. పార్టీ ముందస్తుగా మరోసారి అభ్యర్థి విజయావకాశాలపై మరోసారి సర్వ్ చేపట్టింది. సర్వేలో వెనుకబడి ఉన్నట్టు తేలడంతో అభ్యర్థిని మార్చబోతున్నట్టు ఖమ్మంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
పెద్దపల్లిలో …..
పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన గోమాస శ్రీనివాస్ ను బరిలో దింపింది.శ్రీనివాస్ పార్టీ నిర్ణయాలకు అనుకూలంగా నడుచుకోవడంలేదని ఫిర్యాదులు వెళ్లాయి. అంతేకాదు ప్రచారం కూడా సరిగా చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.నాయకులను కలుపుకొని పోవడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.శ్రీనివాస్ ను కూడా తొలగించి,గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ ఒక తాజా కాంగ్రెస్,మాజీ బిఆర్ఎస్ నాయకుడికి పార్టీ కండువా కప్పి పోటీచేయించాలనే ఆలోచన ఉన్నట్టు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రచారం సాగుతోంది.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.