మందమర్రిలో పాతోళ్లు చేతులు కలిపిండ్రు
వంశీ గెలుపే లక్ష్యమంటున్న నాయకులు చేరినవారితో చేతులు కలపని పాతతరం కోల్ బెల్ట్ ప్రతినిధి: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపే తమ లక్ష్యమని మందమర్రి మున్సిపాల్టీ పరిధిలోని కొందరు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసారు.డాక్టర్ వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం పనిచేసిన తామందరం,ఇప్పుడు వంశి గెలుపు కోసం కష్టపడుతామని అంటున్నారు.ఇందులో విచిత్రం ఏముంది అనుకుంటున్నారా.ఎవరైనా పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేయాల్సిందేగా అనుకోవచ్చు. కానీ ఇందులోనే తిరకాసు ఉంది. వంశీ ని ఎంపీ గ గెలిపించుకుంటామని మందమర్రిలో...