NIGAMA MEDIA (P) LTD
20.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

మోదీ జన్మదినం సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం దేవునిపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ దేశ సేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాద దీపం వెలిగించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో సుమారు 25 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో మరింత శక్తివంతమైన దేశంగా, విశ్వగురువుగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాద దీపం వెలిగించినట్లు తెలిపారు. దేశ సేవలో నరేంద్ర మోదీ మరింతకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నీలం చిన్న రాజులు తెలిపారు. ఇందులో భాగంగా కార్యకర్తలు తమ ఇళ్లలో సాయంత్రం దీపాలు వెలిగించి నరేంద్ర మోదీ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.