Telangan Temple : తెలంగాణలో భక్తులకు అనేక దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. అందులో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వరం, బాసర సరస్వతీ దేవీ ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం, ధర్మపురి నరసింహ స్వామి దేవాలయం, హైదరాబాద్ చిలుకూరి బాలాజీ దేవస్థానం, యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం, సిరిసిల్లలో రేణుక మాతా ఆలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం, వరంగల్ లో భద్రకాళి అమ్మవారి ఆలయం ఇలా ఎన్నో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఉన్నాయి.
ఆయా దేవాలయాల్లో భక్తులు వివిధ రకాల పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. భక్తులకు ఆలయ కమిటీ తోపాటు దేవాదాయ శాఖా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతి దేవాలయంలో భక్తులకు దేవస్థానం అధికారులు, సిబ్బంది నిత్యం లడ్డు ప్రసాదం, పులిహోర, చక్కెర పొంగలి, నిత్య అన్నదానం పంపిణీ చేస్తున్నారు. ప్రపంచంలోనే తిరుమల, తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదానికి ఎంతో పేరు ఉంది. ఆ ప్రసాదం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు.
తెలంగాణ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు, రోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు ఇరువై ఐదు వేల నుంచి అరవై వేల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దర్శనం చేసుకున్న భక్తులు నరసింహుడి ప్రసాదంను ఇంటికి తీసుకెళుతారు. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, బందువులకు, స్నేహితులకు పంపిణీ చేస్తారు.
ఇప్పుడు ఆ తెలంగాణ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి లడ్డు ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి బ్లిస్ ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టూ గాడ్ గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుకు సంబందిచిన సెర్టిఫికెట్ ను సైతం ఇటీవలనే సంస్థ దేవస్థానం కు అందజేసింది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి యాదాద్రి ప్రసాదంకు గుర్తింపు రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.