Pavan Kalyan : 2014 లో రాజకీయ పురుడు పోసుకున్నారు ప్రముఖ సినీ నటుడు వన్ కళ్యాణ్. జనసేన పేరుతో ప్రజల్లోకి అడుగుపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో 2014 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం బరిలో నిలిచింది పార్టీ. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేశారు. అయినా ఏ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. రెండు ప్రాంతాల్లో కూడా పరాజయం పాలయ్యారు పవన్ కళ్యాణ్. అయన ఓటమితో ఏపీ లో జనసేన పార్టీ కనుమరుగయినట్టే అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారో అప్పటి నుంచే ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఒంటరి పోరాటానికి దిగారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉన్నారు.
కానీ జగన్ ను ఇంటి బాట పట్టించాలంటే ఒంటరి బలం సరిపోదనే విషయాన్నీ గమనించాడు. సరిగ్గా ఎన్నికలకు కొద్ధి రోజుల ముందు ఏపీ సీఎం జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఒకవైపు బీజేపీ నేతలతో నిర్విరామంగా మంతనాలు జరిపారు. మరోవైపు తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడితో మంతనాలు జరిపారు. ముగ్గురం కలిసి రాబోయే ఎన్నికల్లో కలిసి నడుద్దామనే ఆలోచన విధానాన్ని బీజేపీ పెద్దల తో పాటు టీడీపీ అధినేత ముందు ఉంచారు. ఎట్టకేలకు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు జగన్ ను ఇంటిబాట పట్టించడానికి కూటమిగా ఏర్పడ్డారు.
పార్టీ నిర్మించిన తరువాత సరిగ్గా పదేళ్లకు పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. జనసేన అధికారం లోకి రాలేక పోయిన పరవాలేదు. కానీ జగన్ మాత్రం అధికారంలో ఉండకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి మోదీ నే రంగంలోకి దించారు. విస్తృత ప్రచారం చేశారు. కూటమి అనుకున్నట్టుగానే జగన్ ఇంటి బాట పట్టారు. కూటమి అసెంబ్లీ బాట పట్టారు. దింతో కూటమి శిబిరంలో ఆనందాలు వ్యక్తం అవుతున్నాయి.