Shami Plant In Home : దసరా పండుగ రోజు జమ్మి చెట్టుకు భక్తితో పూజలు చేస్తారు. ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకొని అలయ్ బలయ్ తీసుకుంటారు. దసరా రోజు మాత్రం జమ్మి కొమ్మలను సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. కానీ ఇళ్లల్లో దాదాపుగా జమ్మిచెట్టు ఉండదు. కానీ ఇంటి ఆవరణంలో జమ్మి చెట్టు పెంచుకోవచ్చని వేదంలో స్పష్టంగా పేర్కొనబడింది. ఇంటి కుటుంబ సభ్యులు పూజలు కూడా జమ్మి చెట్టుకు పూజలు చేయవచ్చని శాస్త్రంలో ఉంది.
జమ్మి మొక్కను నియమ నిష్ఠలతో పూజిస్తే దైవ అనుగ్రహం కూడా పొందవచ్చు. జమ్మి మొక్క శివునికి ఇష్టమైన మొక్క. అదేవిదంగా శనీశ్వరుడు జమ్మి మొక్కలోనే నివసిస్తాడని వేదంలో ఉంది. ఈ మొక్కను ఇంటిలో నాటుకోవచ్చని వేదంలో స్పష్టంగా ఉంది. సరైన దిశలో నాటుకుంటేనే సత్పలితాలు వస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
జమ్మి చెట్టులో శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఇంటిలో నాటుకోవడం వలన శనీశ్వరుడి ఆశీర్వాదం పొందుతాం. ఎవరికయినా ఎల్ల నాటి శని ఉంటె జమ్మి మొక్కకు క్రమం తప్పకుండ పూజలు చేసినచో ఫలితం ఉంటుంది. జమ్మి ఆకులతో వినాయకుడికి పూజ చేయడం వలన శని దోషం కూడా తగ్గుతుంది. అదేవిదంగా జమ్మి ఆకులను శివునికి సమర్పించినచో మోక్షం లభిస్తుంది. గణేశుడికి, శని దేవుడికి
జమ్మి ఆకులతో పూజ చేసినచో ఇంటికి శుభం కలుగుతుందని వేదంలో ఉంది.
జమ్మి చెట్టును ఇంటి ప్రధాన ద్వారానికి ముందు నాటుకొన్నచో అనుకూలమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ చెట్టును ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగానే నాటుకోవడం మంచిది. మరో చోట నాటుకోవడం కుదరదు అని వాస్తు శాస్త్రం తో పాటు వేదంలో కూడా స్పష్టం చేయబడింది.