Allu Arjun Fans unhappy : అల్లు అర్జున్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. జాతీయ స్థాయి అవార్డు అందుకొని ఫుల్ జోస్ లో ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప మొదటి భాగం మంచి విజయాన్ని అందించింది. అదేవిదంగా అత్యధిక కలెక్షన్ లు కూడా సాధించి పెట్టింది పుష్ప మొదటి భాగం. పుష్ప ప్రథమ భాగానికి అనుబందంగా రెండో భాగాన్ని కూడా నిర్మించాలని దర్శకుడు సుకుమార్ ముందే నిర్ణయించు కున్నారు. అభిమానుల ఆశయానికి తగ్గట్టుగా పుష్ప-2 ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రశ్మిక, అల్లు అర్జున్ పై ఒక పాటను చిత్రీకరించారు. ఆ పాట సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అభిమానుల ఆశయాలకు తగిన విదంగా పోరాటాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక పాటల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడటం లేదు. ఖర్చుకు వెనుకాడకుండా ఎడిటింగ్ చేస్తున్నారు.
అభిమానులు సినిమా ఎప్పడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ పుష్ప-2 లో మహిళా వేషధారణలో ఎందుకు కనబడుతున్నాడనేది అభిమానులకు పెద్ద ప్రశ్న గా మిగిలి పోయింది. అభిమానులను మత్తెక్కించే రీతిలో రష్మిక అందాలను తీర్చి దిద్దుతున్నారు. అయితే అభిమానులు ఎదురు చూస్తున్నారు కాబట్టి పుష్ప-2 ను ఆగష్టు-15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రం సాంకేతిక బృందం.
సాంకేతికంగా ఇంకా సినిమాను మరింత ఆకర్షణగా తీర్చిదిద్దబోతున్నారు చిత్రం సాంకేతిక బృందం. అయితే సాంకేతిక అంశాలు ఆగష్టు-15 నాటికి పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనబడుటలేదని చిత్ర నిర్మాతలు గమనించారు. అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా సినిమాను సాంకేతికంగా ఎడిటింగ్ రూపొందించాలంటే సమయం సరిపోవడం లేదని చిత్రం పెట్టుబడిదారులు సోమవారం ప్రకటించారు. పుష్ప-2 సినిమాను ఎట్టి పరిస్థితిల్లోనూ డిసెంబర్-6 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశకు లోనయ్యారు.