Home » Naga Panchami : నాగుల పంచమి ఎలా వచ్చిందో తెలుసా ?

Naga Panchami : నాగుల పంచమి ఎలా వచ్చిందో తెలుసా ?

Naga Panchami : శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల్లో నాగ పంచమి ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగ పంచమిగా కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు. నాగ పంచమిని పురస్కరించుకొని నాగు పామలను భక్తి శ్రద్దలతో పూజించిన వారికి కాల సర్ప, గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పండుగకు సంబంధించి చరిత్రలో ఒక కథ కూడా ఉంది.

ఒక రైతు తన పొలం దున్నుతుండగా నాగలి కింద పడి మూడు నాగు పాము పిల్లలు చనిపోయాయి. దేవతసర్పమైన ఆ పిల్లల తల్లి పాము రైతు కుటుంబము పై పగ పెంచుకుంటుంది. పగతో నాగు పాము రైతు భార్య, ఇద్దరు కుమార్తెలను కాటువేస్తుంది. దింతో ఆ ముగ్గురు చనిపోతారు. రైతు కుమార్తె తన తండ్రిని క్షమించాలని పామును వేడుకుంటుంది. అందుకు ప్రతిఫలంగా తన చేతిలో ఉన్న పాలను స్వీకరించాలని కోరుతుంది. ఆ తల్లి పాము క్షమించి రైతు కుమార్తెను ఏదయినా వరం కోరుకొమ్మని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన తన కుటుంబాన్ని బతికించమని వేడుకుంటుంది. పాము క్షమించి రైతు కుటుంబాన్ని తిరిగి బతికిస్తుంది. అందుకు ప్రతిఫలంగా రైతు కుటుంబంతో పాటు, ఆ గ్రామస్తులు కూడా ఆ నాగు పామును పూజిస్తారు.

అప్పటి నుంచి నాగ పంచమి పర్వదినంన ప్రతి ఏటా భక్తులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇదే శ్రావణంలో నాగ పంచమిని ఎందుకు జరుపుకుంటారు అనేది భక్తుల ప్రశ్న. ఈ సంఘటన జరిగింది శ్రావణ శుక్ల పంచమినాడే కావడం విశేషం. అందుకనే ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్ల పక్షము రోజున మహిళలు భక్తి శ్రద్దలతో పుట్టలో పలు పోసి తమ కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అంటూ మొక్కులు తీర్చుకుంటారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *