Home » God : మొక్కకు ఒక దేవుడు ఉంటాడు

God : మొక్కకు ఒక దేవుడు ఉంటాడు

God : హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా పూజించడానికి ఎదో ఒక మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ప్రధానంగా తులసి మొక్క నూటికి నూరు శాతం ఏర్పాటు చేసుకుంటారు మహిళలు. తులసి మొక్కకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా గద్దె ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు చేస్తారు. ఇతర మొక్కలకు, చెట్లకు దేవస్థానాలు వెళ్ళినప్పుడు పూజలు చేసి తమ భక్తిని చాటుకొని, మొక్కులు తీర్చుకుంటారు. కానీ ప్రతి మొక్కలో, చెట్టులో ఒక దేవుడు లేదంటే దేవత ఉంటారు. దాదాపుగా ఇంటిలో మొక్కలు, చెట్లు పెంచుకుంటారు. కానీ వాటిలో దేవుడు, దేవత ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. తెలియక వాటిని కొట్టివేస్తారు.

ఉసిరికాయ చెట్టులో లక్ష్మి దేవి ఉంటుంది. ఆశ్వయుజ మాసం, కార్తీక్ మాసం లో ఉసిరి చెట్టుకు ఉపవాసంతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అదేవిదంగా మారేడు చెట్టులో ముల్లోకాలకు అధిపతి శివుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శివరాత్రికి మారేడు చెట్టుకు పూజలు చేసి, నైవేద్యం అర్పిస్తారు. అదేవిదంగా అరటి చెట్టులో శ్రీ మహా విష్ణువు ఉంటాడని వేదం చెబుతోంది. అరటి చెట్టుకు గురువారం భక్తిశ్రద్దలతో పూజలు చేసి మహా విష్ణువును ఆరాధిస్తారు. అరటి ఆకులను సత్యనారాయణ స్వామి కి ప్రధానమైనవిగా కూడా కొలుస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం రోజు అరటి ఆకులతో పూజలు చేసి మొక్కులు తీర్చు కుంటారు.

దాదాపుగా చాలా మంది ఇళ్లలో వేప చెట్టు ఉంటుంది. నీడ కోసం పెంచుకుంటారు. వేసవిలో ఎంతో చల్లదనం ఉంటుంది. కానీ ఆ చెట్టులో అమ్మవారు దుర్గాదేవి ఆసీనులై ఉంటుందని తెలియదు. అమ్మవారు దుర్గాదేవిని భక్తులు కొలిచేటప్పుడు వేప చెట్టుకు కూడా ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటు కుంటారు. మన దేశంలోనే కాకుండా థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో వేప చెట్టును చాల పవిత్రంగా ఇంటి ఆవరణలో పెంచుకుంటారు. నిత్యం పూజలు కూడా చేస్తారని ప్రచారం కూడా ఉంది. అందరి ఇళ్లలో ఉండే తులసి మొక్కలో మహా విష్ణువు తో పాటు లక్ష్మి దేవి ఉంటారని భక్తుల విశ్వాసం. ప్రతి కార్తీక మాసంలో శివుడితో పాటు విష్ణు మూర్తి, లక్ష్మి దేవిని పూజిస్తారు. రకరకాల ప్రసాదాలతో పూజలు చేసి అర్పిస్తారు.

 

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *