18Years Job : కనీసం పదోతరగతి పాస్ అయితే సరిపోతుంది. అదే విదంగా 18 ఏళ్ళు వయసు ఉంటె చాలు. ఉద్యోగంలో చేరిన వారికి హాస్టల్ వసతి, భోజనం ఉచితం. ప్రారంభంలో రూ : 16,975 వేతనముతో నియమించు కుంటారు. నియామకం అయిన తరువాత అదనపు విద్యార్హతలు ఉండి, అనుభవం ఉన్నవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒంగోలులోని ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నెల 30న ఇంటర్వ్యూ నిర్వహించ నున్నామని జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి భరద్వాజ్ తెలిపారు.కె. ఎల్ గ్రూప్ సంస్థ ప్రత్యేకంగా అమెజాన్ రిటైల్ సంస్థ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంపెనీలో ప్యాకింగ్, పికింగ్, స్కానింగ్, లోడింగ్, అన్లోడింగ్ విభాగాలల్లో ఖాళీలను భర్తీచేయుటకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏదైనా విభాగంలో ఐ.టి.ఐ, డిప్లమో, టెన్త్, ఇంటర్మీడియేట్ ఏదైనా డిగ్రీ చదువులు పూర్తి చేసిన వారు కూడా ఇంటర్వ్యూకు వెళ్లవచ్చును. ఈ నెల 30వ తేదీన ఇంటర్వ్యూల కోసం జిల్లా ఉపాది కార్యాలయం, ఒంగోలులో హాజరుకావాలి.
విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్ తీసుకెళ్లాలి. ఒక సెట్ జిరాక్స్ కూడా వెంట ఉండాలి. మరిన్ని వివరాల కోసం https://forms.qle/wnfddgAQGrLSRwgg9 సైట్ ను పరిశీలించాలి. ఉద్యోగానికి ఎంపికైన వారు హైదరాబాద్, చెన్నై నగరాలలో పని చేయాల్సి ఉంటుంది.