Home » Srivari laddu : 5100 వేంకటేశ్వరస్వామి లడ్డు తయారీకి ఏమేమి వాడుతారో తెలుసా ?

Srivari laddu : 5100 వేంకటేశ్వరస్వామి లడ్డు తయారీకి ఏమేమి వాడుతారో తెలుసా ?

Srivari laddu : 1940 లో తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ధర ఎనిమిది అణాలు. ఆ తరువాత క్రమంగా రెండు రూపాయలకు చేరింది. ఆ తరువాత నాలుగు రూపాయలు, ఐదు రూపాయలకు చేరింది. ఖర్చులు పెరగడంతో పది రూపాయలకు చేరింది. ప్రస్తుతం 175 గ్రాములు ఉండే లడ్డు ప్రసాదం ధర రూ : 50 చేరడం విశేషం. శ్రీవారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తారు. అదేవిదంగా లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు.

ఒకేసారి 5,100 లడ్డూలను తాయారు చేయడానికి ఏమేమి సరుకులు వాడుతారు. ఎంతెంత వాడుతారు అనే విషయం చాలా మంది శ్రీవారి భక్తులకు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం.

5,100 లడ్డూలను తయారు చేయడానికి 810 కిలోల సరుకులను వాడుతారు. ఇందులో 165 కిలోల ఆవునెయ్యి, 180 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, ముంతమామిడి పప్పు 30 కిలోలు, ఎండు ద్రాక్ష 18 కిలోలు, కలకండ 8 కిలోలు, యాలకులు 4 కిలోలు, 5 కిలోల పచ్చ కర్పూరం వాడుతారు. ప్రతిరోజు కనీసం మూడు లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆరువందల మంది సిబ్బంది లడ్డు తయారీకి పనిచేస్తుంటారు.

లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణి చేయడం వలన ప్రతి ఏటా శ్రీవారికి రూ: 500 కోట్ల ఆదాయం వస్తుందని తిరుమల-తిరుపతి దేవస్థానం గణాంకాలు చెబుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *