Elephant : ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆనందంగా గడపటానికి, ఆర్థికంగా ఎదగడానికి కొందరు పూజలు చేస్తారు. కొందరు దానధర్మాలు చేస్తారు. ఇంకొందరు ఉదయం, సాయంత్రం ఇంటి ఇలవేలుపు కు పూజ చేస్తారు. వీటితో పాటు వెండి ఏనుగు, ఆవు, లాఫింగ్ డాల్ బొమ్మలు కూడా ఇంటిలో పెట్టుకుంటారు. వీటిలో వెండి ఏనుగు ఇంటిలో పెట్టుకోవచ్చా, లేదా ? ఒకవేళ వెండి ఏనుగు కొంటె ఏ దిక్కున ఇంటిలో పెట్టుకోవాలి అనే విషయాన్నీ వాస్తు శాస్త్రంలో ఈ విదంగా ఉంది.
వెండి ఏనుగు బొమ్మను ఇంటిలో ఉత్తరం దిక్కులో పెట్టుకోవాలి. ఆ విదంగా పెట్టడం వలన ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషం తొలగిపోతుంది. అదేవిదంగా పాజిటివ్ ఎనర్జీ ఇంటికి కలుగుతుంది. దేవుని గదిలో పెడితే ఆర్థిక కష్టాలు తగ్గిపోయి, కుటుంబం చేపట్టిన పనులు అభివృద్ధి చెందుతాయి.
ఇంటికి ఆర్థిక లోటు అనేది రాదు. పనిచేస్తున్న కార్యాలయం గదిలోగాని, వ్యాపార సంస్థలో గాని పెడితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రంగు, రంగు ల ఏనుగు బొమ్మ పెట్టరాదు. కేవలం వెండితో తయారు చేసిన ఏనుగు బొమ్మను మాత్రమే ఇంటికి ఉత్తరం దిక్కులో పెట్టాలి. ఇంటిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నెగటివ్ ఎనర్జీ తగ్గిపోయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.