Home » Sivaratri :శివరాత్రి రోజు ఉపవాసదీక్ష విరమణ ఈ విధంగా చేయాలి

Sivaratri :శివరాత్రి రోజు ఉపవాసదీక్ష విరమణ ఈ విధంగా చేయాలి

Sivaratri : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అనేకమంది భక్తులు ఒకరోజు ఉపవాస దీక్ష భక్తితో చేస్తారు. శివనామ స్మరణంతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. జాగరణ చేయడానికి భక్తులు శివాలయాల్లకు వెళుతారు. శివరాత్రి రోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దాదాపుగా ఆరోజు ఉపవాస దీక్ష చేస్తుంటారు. కానీ ఏ పద్దతిలో చేయాలి అనే విషయాలు చాలా మంది భక్తులకు తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్నీ తెలుసుకుందాం…….

ఉపవాస దీక్ష చేయడం వలన ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది. అంతర్గత శాంతి, జ్ఞానోదయాలు, కలుగుతాయి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. మానసిక స్థిరత్వం కలుగుతుంది.

నీటితో ఉపవాసం.. రోజంతా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే తాగాలి.

ఫలములతో ఉపవాసం…. కేవలం ఫలములు, గింజలను ఆహారముగా తీసుకొని ఉపవాద దీక్ష చేయవచ్చు.

ద్రవ పదార్థాలతో ….. తేనీరు, పాలు, కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవపదార్థాలతో కూడా ఉపవాస దీక్ష చేయవచ్చు.

సాత్వికాహారముతో…. ఆరోగ్యం బాగులేని వారు, మందులు వాడుతున్నవారు సగ్గుబియ్యం, ఉడకబెట్టిన దుంపలను ఉప్పు, కరం లేకుండా తీసుకొని దీక్ష చేయవచ్చని వేద పండితులు చెబుతున్నారు.

ఉపవాసంతో జాగరణ చేసిన వారు మరుసటి రోజు నిమ్మరసం, పాలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకొని ఉపవాస విరమణ చేయవచ్చని వేద పండితులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *