biknoor : కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి 18వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలకు బోనాలు, శ్రీ వన దుర్గ పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్దలతో నిర్వహించిన కళ్యాణం భక్తులను ఆకట్టుకొంది. కళ్యాణం అంతా కూడా పండుగ వాతావరణాన్ని మరిపించింది. శ్రీ వన దుర్గ పెద్దమ్మ పెదరాజుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
పెద్దమ్మ తల్లి కళ్యాణం పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు నవగ్రహ పూజలు, హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణి చేసారు. అనంతరం ముదిరాజ్ సదర్ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రసాదం పంపిణి చేశారు.