Pumpkin Seeds : శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచడంలో చాలా కాయ గింజలు ఉపయోగపడుతున్నాయి. అందులో గుమ్మడి గింజలు కూడా శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజలు తినడం వలన శరీరంలో జరిగే మార్పులు గమనిస్తే వదిలిపెట్టకుండా తింటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి గింజలు పచ్చివి లేదా వేయించుకొని తినవచ్చు. వీటిని నానబెట్టి లేదా మొలకెత్తించి తీసుకుంటే పోషకాలు పుష్కలంగా అందుతాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరానికి ఇలా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
గుమ్మడి గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫైబర్ జీర్ణాశయంలో బాగా పనిచేసి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటును నియంత్రిస్తుంది., ఎముకల బలాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వాపు తగ్గించడంలో సహాయపడతాయి. హానికరమైన రోగాల నుంచి కాపాడుతాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.