Home » Bibipeta : బీబీపేటలో ఘనంగా అయ్యప్ప పూజలు

Bibipeta : బీబీపేటలో ఘనంగా అయ్యప్ప పూజలు

Bibipeta : బీబీపేట మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఏడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. మామిడి తోరణాలు కట్టి సుందరంగా ఆలయాన్ని తీర్చి దిద్దారు. అయ్యప్ప భక్తులు పాల్గొని గణపతి హోమం, కలిశాభిషేకం, అష్టాభిషేకం ఉత్సవాలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. హోమం కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయ్యప్ప భక్తి పాటలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్బంగా అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తితో చేసిన నినాదం మిన్నంటాయి. అయ్యప్ప భక్తులు పాడిన భక్తి గీతాలు భక్తులను ఎంతో అలరించాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణి చేశారు. ఈ సందర్బంగ పూజ అనంతరం అన్న ప్రసాదం పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్పసేవా సంఘం అధ్యక్షులు చందుపట్ల విట్టల్, ప్రధాన కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్, కోశాధికారి M పరశురాం, గురు స్వాములు చంద్రశేఖర్, ఎర్రం ప్రసాద్ ,ఆది రాజయ్య, భూమా గౌడ్, తేలు సత్యనారాయణ, నందకుమార్ లతో పాటు మండలంలోని అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు,

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *